Posts

Showing posts with the label Karimnagar Police Commissioner Gous Alam revealed

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు : బీహార్‌లో మరో నిందితుడి అరెస్ట్, 2 పిస్టళ్లు స్వాధీనం

Image
తె లంగాణలోని కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దుకాణం దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 3 నుండి జూన్ 7 వరకు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న ముఖ్య నిందితులు సుబోధ్ సింగ్ (A-1), రఘునాథ్ కర్మాకర్ (A-2), రవిష్ కుమార్ (A-3)లను విచారించిన అనంతరం ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదివారం వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు, దోపిడీకి ఉపయోగించిన రెండు పిస్టళ్లను వెలిశాల బైపాస్ రోడ్డు సమీపంలోని పొదల నుంచి, అలాగే నేరంతో సంబంధం ఉన్న ఒక వివో మొబైల్ ఫోన్‌ను ధర్మపురి మార్గంలోని మద్దునూరు గ్రామ అటవీ ప్రాంతం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దొంగిలించబడిన బంగారం, వజ్రాభరణాల ఆచూకీకి సంబంధించి నిందితులు పోలీసులకు పూర్తిగా సహకరించడం లేదని, దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో మళ్లీ పిటిషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు.