ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు!
తె లంగాణలో నీళ్ల సమస్యకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ కారణమేనని, ఇరిగేషన్‌ను నాశనం చేసిందే ఆయనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణలో నీటి సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అయితే, రెండోది ఎల్‌నినో ప్రభావం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. నీళ్ల పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. ఆయన వల్లే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి. భారీగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేనే ఇంజనీర్‌ను అంటూ కాళేశ్వరం కట్టి మరీ కూల్చారు. ఇంజినీర్లు చెప్పినట్లు ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఆయన హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందలేదు. ఇదే కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన ఇలాగే చేశారు. అసలు ఎస్‌ఎల్‌బీసీని పూర్తి కాకుండా గత ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రస్తుతం మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీకి బీఆర్‌ఎస్ సరెండర్ అయితే మేమేం ...