Posts

Showing posts with the label Jehanabad district of Bihar

రైలు చైన్ లాగి యువతిని పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేసిన దుండగులు

Image
బీ హార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తన నానమ్మ ఇంటికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తుండగా రైలు చాకంద్, బేలా స్టేషన్ల మధ్య చేరుకోగానే కొంతమంది గుర్తుతెలియని దుండగులు అత్యవసర చైన్ లాగి రైలును ఆపారు. రైలు ఒక్కసారిగా ఆగగానే, నిందితులు యువతి ప్రయాణిస్తున్న కోచ్‌లోకి చొరబడి అందరూ చూస్తుండగానే ఆమెను బలవంతంగా బయటకు లాగి పట్టాల పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లిన ఐదుగురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు అతికష్టమ్మీద తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిందంతా వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బేలాగంజ్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న 10 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయిత...