Posts

Showing posts with the label Jealousy and envy are human nature

ఈర్ష్య, అసూయ మానవ నైజం : 'రాజాసాబ్‌' ఫ్లాప్‌ కావాలని కోరుకొనే వారిని ఉద్దేశించి దర్శకుడు మారుతి

Image
హీరో ప్రభాస్ తో  'ది రాజాసాబ్‌'సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా దర్శకుడు మారుతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు మారుతిని ఇంటర్వ్యూలో భాగంగా మీ సినిమా సరిగ్గా ఆడకూడదని, విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు, నిజానికి వాళ్లు అలా ఎందుకని ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకు బదులిస్తూ తాను సక్సెస్ అందుకుంటే మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారుతానని వాళ్లు అలా అనుకుంటూ ఉండవచ్చని చెప్పారు. ఈర్ష్య, అసూయ మానవ నైజం అని అన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అనుకుంటారని, నేను సక్సెస్‌తో పై మెట్టు ఎక్కితే వాళ్లకు ఎక్కడ దొరకనేమో అనే భయంతోనే అలా అనుకుంటారని అన్నారు. అయితే తానెప్పుడూ స్టార్‌డమ్‌ శాశ్వతం అనుకోనని వెల్లడించారు. తనకు కథ ముఖ్యం అని, దానికి ఏ హీరో సెట్‌ అవుతారు అనుకుంటే ఆయనతో సినిమా తీస్తానని 'ది రాజాసాబ్‌' తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీస్తాను. చాలా కథలు ఉన్నాయి. స్టార్ హీరోతో సినిమా చేశాను అని, అన్నీ అంత భారీ స్థాయిలోనే తీయాలనే ఆలోచనలు, కోరిక...