కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ చేయనున్న పవన్ కళ్యాణ్
తె లంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనవరి 3న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఈ నిధులతో 100 గదుల అత్యాధునిక ధర్మశాల నిర్మాణం, అలాగే 2,000మంది భక్తులు ఒకేసారి హనుమాన్ దీక్ష విరమించే భారీ మండపం నిర్మాణం చేయనున్నారు. సుదూర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలు కూడా ఈ ప్రణాళికలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు ఆలయ మౌలికవసతులను, భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి. ఈ పర్యటనకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పవన్ కల్యాణ్ రాకతో భక్తులు, ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీటీడీ నిధులను...