Posts

Showing posts with the label JNTUH Global Alumni Meet - 2025' organized at the JNTUH Auditorium

కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో 'అగ్రగామి'గా తెలంగాణ !

Image
హై దరాబాద్‌లోని కూకట్ పల్లి, జేఎన్టీయూ హెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన 'జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్‌ - 2025'కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్య మిస్తోందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా 'ఎకో సిస్టం'ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 'ఏఐ'లో బెంచ్ మార్క్‌ను సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే 'తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్'ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని, సమాజానికి తిరిగి ఇవ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని ...