Posts

Showing posts with the label J. Nivas

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి

Image
ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. అయితే, పదోన్నతి కల్పించినప్పటికీ వారు నిర్వహిస్తున్న విధుల్లోనే యధావిధిగా కొనసాగనున్నారు. ఈ పదోన్నతుల్లో భాగంగా, ఐదుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్స స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్-14) ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జీవో జారీ చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె.నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా చేపట్టే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.