Posts

Showing posts with the label Instead of making allegations

సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయం : కిషన్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

Image
సిం గరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటరిచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ స్పందిస్తూ 'కిషన్ రెడ్డి పలుకులు బీఆర్ఎస్ నేతలవి. కేటీఆర్, హరీష్ దారిలో కిషన్ రెడ్డి ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా విచారణ జరపమనండి. ఎవరు వద్దన్నారు. టెండర్ల అవకతవకలపై చర్చకు రండి. ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిజాలపై చర్చకు రండి. గత బీఆర్ఎస్ హయంలో అవకతవకలపై దర్యాప్తు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పారదర్శకత వచ్చింది' అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా అంతకుముందు కిషన్‌ రెడ్డి టెండర్ల విషయమై సంచలన ఆరోపణలు చేశారు. కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర పెద్దల ఆదేశంతోన...