Posts

Showing posts with the label Infinix Xpad 30E launched with AI features for students

విద్యార్థుల కోసం ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30E విడుదల

Image
అం తర్జాతీయ మార్కెట్లో విద్యార్థుల కోసం ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30E ఇన్ఫినిక్స్ కంపెనీ విడుదల చేసింది. చదువుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసులకు అనువైన ఫీచర్లతో రూపొందించబడిన ఈ టాబ్లెట్, సరసమైన ధరలో అత్యాధునిక సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తోంది. ఇది ప్రధానంగా ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ చేయబడింది మరియు త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డివైజ్‌లో మెరుగైన లెర్నింగ్ రిసోర్సెస్‌తో పాటు కృత్రిమ మేధ  సాయంతో పనిచేసే విద్యా సంబంధిత టూల్స్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ టాబ్లెట్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 11 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 440 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి, కళ్లకు హాని కలగకుండా టీయూవీ రైన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ హెలియో G80 చిప్‌సెట్‌ను వాడారు, దీనికి తోడు 4GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని మరింత పెంచుకునే వీలుంది. సాఫ్ట్‌వేర్ ప...