Posts

Showing posts with the label Indiramma Towers in Nalgonda

నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్

Image
తె లంగాణాలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యులు సోమవారం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు పొదుపు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్ రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు లక్షలాది ఇళ్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం,తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కలిసి విజ్...