Posts

Showing posts with the label India in Second

5జీ నెట్‌వర్క్ వినియోగం : చైనా మొదటి స్థానం, ఇండియా రెండో స్థానం

Image
ప్ర పంచంలో 5జీ నెట్‌వర్క్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో, ఇండియా రెండో స్థానంలో నిలిచింది. ఇండియాలో 5జీ యూజర్ల సంఖ్య 40 కోట్ల మార్కును దాటిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా "ఎక్స్" వేదికగా వెల్లడించారు. 5జీ నెట్‌వర్క్ వినియోగంలో 110 కోట్ల యూజర్లతో చైనా తొలిస్థానంలో నిలిచింది.40 కోట్ల యూజర్లతో రెండో స్థానంలో ఇండియా,35 కోట్ల యూజర్లతో అమెరికా మూడోస్థానంలో, 20 కోట్ల మంది యూజర్లతో యూరోపియన్ యూనియన్ నాలుగో స్థానంలో, తర్వాత స్థానంలో 19 కోట్ల యూజర్లు కలిగిన జపాన్ ఉంది. "400 మిలియన్లకు పైగా 5G యూజర్లతో, భారతదేశం నేడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద 5G సబ్‌స్క్రైబర్ బేస్‌గా , ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా స్వీకరించే దేశాలలో ఒకటిగా నిలిచింది" అని సింధియా X పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశంలో 2022లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5G సేవలు ప్రారంభించినప్పటి నుండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 99.6% మేజర్ బేస్‌తో ,దేశంలో 85% జనాభా కవరేజీతో అందుబాటులో ఉన్నాయి. మార్చి 2025 నాటికి, దేశవ్యాప్తంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4.69 లక్షల 5G బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లను  ఏర్పాటు చేయబడ్డాయి. డిస...