Posts

Showing posts with the label Implementation of 'Nethanna Bharosa' Scheme on August 7

పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ పన్నును భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం

Image
కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నును భారీగా పెంచింది. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ.8.50 నుంచి రూ.15.50కు పెంచారు. అలాగే, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ.7.50 నుంచి రూ.14.50కు పెంచారు. ఈ కొత్త పన్ను రేట్లు జూలై 16 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, పెట్రోల్ ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ.4 మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ అనేది ప్రభుత్వం చమురు కంపెనీలపై లేదా ఎగుమతిదారులపై విధించే అదనపు పన్ను. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు కంపెనీలకు అధిక లాభాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దేశీయ మార్కెట్‌లో ఇంధన లభ్యతను కాపాడడం, అధిక లాభాలను నియంత్రించడం కోసం ప్రభుత్వం ఈ పన్నును విధిస్తుంది. 

ఆగస్టు 7న నేతన్న భరోసా పథకం అమలు

Image
చే నేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును చేనేత జౌళి శాఖ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది అర్హులకు నేతన్న భరోసా పథకాన్ని అందించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు సంవత్సరానికి 25 వేల రూపాయలు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసిపి సర్కార్ హయాంలో ఈ పథకం కింద 24వేల రూపాయలు ఇవ్వగా, గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా కలిపి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మాట ఇవ్వనప్పటికీ కూడా ఏపీ సర్కార్ చేనేతలకు అండగా నిలుస్తోంది.చేనేత కార్మికులను ఉద్దేశించి గతంలో మాట్లాడిన చంద్రబాబు వారికి అండగా నిలుస్తామని గత ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు కలిపి సంవత్సరానికి 25వేలు చొప్పున ఆర్థికసహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించింది. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా విడుదల చేయనుంది. సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు కుటుంబానికి ఒకరికి చొప్పున ఈ పథకాన్ని అం...