గేట్ ఫలితాలు విడుదల
దే శవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఐఐటీలు, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, వాటన్నింటినీ పరిశీలించి తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈ-మెయిల్ అడ్రస్ , పాస్‌వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వడం ద్వారా తమ స్కోర్ కార్డును పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://gate2026.iitg.ac.in/index.html లో ఫలితాలను చూడవచ్చు. గేట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించడం అనేది కేవలం ఒక అర్హత మాత్రమే కాదు, అది విద్యార్థి కెరీర్‌ను మలుపు తిప్పే ఒక గొప్ప ఆయుధం కూడా. దీని ద్వారా దేశంలోని టాప్ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ వంటి సంస్థల్లో ఎంటెక్, ఎంఎస్, నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది. నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యే వీలుంటుంది. ఉన్నత విద్య అభ్...