నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారు : స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా !
తె లంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారన్నారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి చేశారు. నా డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. నా డొక్కలో పిడిగుద్దులు గుద్దినా నేను ఏం మాట్లాడలేదు.. అసహనంతో నేను అనని మాటలని స్పీకర్‌కు ఆపాదించారని వివరణ ఇచ్చారు. నేను మాట్లాడిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన మా ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మహిళ శాసన సభ్యులపై పోలీసులు దాడి చేశారు.. మహిళ ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు హోం శాఖ మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన విషయాలు నేను రేపు కౌన్సిల్‌లో మాట్లాడుతానని పేర్కొన్నారు.