అనుమానంతో భార్యను చంపిన భర్త
రా జస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన దీపక్, సోనమ్ ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉపాధి కోసం వారు గురుగ్రామ్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు మొదలయ్యాయి. ఆ వ్యక్తితో సోనమ్ ప్రేమలో పడింది. ఈ విషయం దీపక్‌కు తెలిసి, ఆమెపై నిఘా ఉంచడం ప్రారంభించాడు. "అల్వార్ వెళ్తున్నాను" అని బయలుదేరి, ఇంటి దగ్గరే ఉంటూ భార్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఏప్రిల్ నెలలో దీపక్ అల్వార్ నుండి తిరిగి వచ్చాడు. అప్పుడు సోనమ్ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుండటం చూశాడు. దీపక్ రాగానే ఆమె ఫోన్ కట్ చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావని దీపక్ అడగ్గా, సోనమ్ దాచడానికి ప్రయత్నించింది. ఫోన్ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, కోపంతో దీపక్ తన భార్య సోనమ్ దుపట్టాతో గొంతు నులిమి చంపేశాడు. భార్య మరణం తర్వాత, దీపక్ పక్క గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మానాన్నల మధ్య గొడవ, అరుపులు విని కొడుకు అక్కడికి రాగా, దీపక్ "ఏమీ లేదు నాన్నా, నువ్వు వెళ్లి టీవీ చూడు" అని చెప్పి పంపేశాడు. తండ్రి మాట విని ఆ చిన...