ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం
హి మాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. అధికారులు, ఉద్యోగులు జీన్స్, టీ-షర్టులు, తదితర ఫ్యాన్సీ దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ఆదేశాలు జారీ చేసింది. జిమ్‌కు సంబంధించిన ఒక ప్రొడక్ట్‌ను ప్రచారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్‌తో ప్రభుత్వ అధికారులపై చర్చ, సిమ్లా అర్బన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఓషిన్ శర్మకు సంబంధించిన ఇటీవలి వివాదం నేపథ్యంలో ఈ ఆదేశం వెలువడింది. మార్చి 16న పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. అంతేకాదు వీటిని కఠినంగా అమలు చేసేలా పరిపాలనా కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా అధికారులందరికీ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కోర్టు విచారణలతో సహా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు, లాంఛనప్రాయంగా , హుందాగా కనిపించాలని రాష్ట్రం ఆదేశించింది. లేత రంగుల్లో ...