Posts

Showing posts with the label Health Minister Satya Kumar Yadav announced

ఆంధ్రప్రదేశ్ లో 913 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ఆమోదం

Image
ఆం ధ్రప్రదేశ్ లో 913 ఆశా వర్కర్ల  పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ చేసినట్లవుతుందన్నారు. జీరో వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం 1294 ఆశా వర్కర్ల పోస్టుల్ని భర్తీ చేసిందన్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న 913 ఆశా వర్కర్ల పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. నిబంధనలను అనుసరించి ఈ నెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. అనకాపల్లిలో 77, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజ...