Posts

Showing posts with the label He was speeding on the Delhi-Meerut Expressway and hit the divider.

లైవ్‌ లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న యూట్యుబర్ అనురాగ్ దోభాల్

Image
బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యుబర్ అనురాగ్ దోభాల్ ఇన్‌ స్టాగ్రామ్ లైవ్‌ లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఢిల్లీ - మీరట్ ఎక్స్ ప్రెస్ వే పై కారును అతివేగంగా నడుపుకుంటూ వెళ్లి వేగంగా డివైడర్ ను ఢీ కొట్టారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తన తల్లి ప్రేమ కోసం పరితపిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ 150 కిలోమీటర్ల వేగంతో కారును డివైడర్‌కు ఢీకొట్టి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈమేరకు 'ఇదే నా చివరి ప్రయాణం' అంటూ లైవ్ లో తన ఫాలోవర్లకు గుడ్ బై చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తాను వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడమేనట. దాంతో అతడ్ని కుటుంబం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అతడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు సమాచారం. ముందే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న దోభాల్.. ఈ మేరకు మార్చి 7న రాత్రి ఘజియాబాద్‌ లో దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై అనురాగ్ తన కారులో వెళ్తూ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు...