ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ సాధించిన షూటర్ సామ్రాట్ రాణా
ఐ ఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ విభాగంలో వ్యక్తిగతంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా అతడు నిలిచాడు. తన మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడిన సామ్రాట్ రాణా 243.7 పాయింట్ల స్కోర్ సాధించాడు. చైనాకు చెందిన హు కై కంటే 0.4 పాయింట్ల తేడాతో గోల్డ్ సాధించాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ 221.7 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని భారత్‌కు ఈ ఈవెంట్‌లో రెండు పతకాలను అందించారు. తన విజయం తర్వాత సమ్రాట్ రాణా మాట్లాడుతూ ఈ విజయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది నా మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, గోల్డ్ గెలవడం అద్భుత అనుభూతి. నేను కేవలం నా టెక్నిక్‌పై దృష్టి పెట్టాను. స్క్రీన్ చూడలేదు, ప్రతిసారి ఒకే విధంగా షూట్ చేయడానికి ప్రయత్నించానని సామ్రాట్ రాణా అన్నారు. ఒలింపిక్ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలుచుకున్న ఐదవ భారతీయ షూటర్ గా సామ్రాట్ రాణా నిలిచాడు. దీనితో అతను అభినవ్ బింద్రా, రుద్రాంక్ష్ పటిల్, తేజస్విని సావంత్, శివ నర్వాల్-ఈషా సింగ్ జంట సరసన చేరాడు. ఫైనల్ ప్రారంభంలోనే రాణా మంచిగా ఆరంభ...