తెలంగాణ రైజింగ్ కార్యక్రమం : హైటెక్స్‌లో థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన
తె లంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైటెక్స్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని, పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నరేళ్లల్లో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గ్లోబలైజేషన్ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ...