మూడు కొత్త గేమింగ్ ల్యాప్ టాప్స్ !
ప్ర పంచంలోనే అతిపెద్ద టెక్ షో గా చెప్పబడే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఈఎస్) ను అనేక బ్రాండ్స్ నుండు చాలా ప్రోడక్ట్స్ ప్రదర్శించ బడ్డాయి. ఈ అతి పెద్ద టెక్ షో నుండి ఈరోజు ఒక మూడు టాప్ గేమింగ్ ల్యాప్ టాప్స్ రివీల్ చేయబడ్డాయి. ఈ టెక్ షో USA లోని లాస్ వేగాస్ లో జరిగింది మరియు ఈరోజుతో ముగుస్తుంది. సిఇఎస్ 2024 నుండి ఈ HP Omen Transcend 14 గేమింగ్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్ టాప్ గేమింగ్ మరియు క్రియేటివ్ టాస్క్ ల రెండింటి కలయికగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ సన్నని బాడీతో అందంగా కనిపిస్తోంది. ఇందులో, 14 ఇంచ్ OLED డిస్ప్లే 2.8K రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. మెరుగైన IMAX సర్టిఫైడ్ OLED డిస్ప్లేని ఈ ల్యాప్ లో వుంది. ఈ HP ల్యాప్ టాప్ కేవలం 1.6 కేజీ ల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 11.5 గంటల బ్యాకప్ అందించగల బ్యాటరీని type-C PD 140W అడాప్టర్ సపోర్ట్ తో కలిగి వుంది. ఇది Intel Ultra 9 185H ప్రోసెసర్ మరియు NVIDIA GeForce RTX 4070 GPU తో పని చేస్తుంది. ఏలియన్ వేర్ M16 and M18 ల్యాప్ టాప్ లను ఈ షో నుండి రివీల్ చేసింది. ముందుగా Alienware M16 గురించి చూస్తే, ...