Posts

Showing posts with the label Gunman shoots and kills four family members

అమెరికాలో ఎన్నారై ఘాతుకం : నలుగురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన దుండగుడు

Image
అ మెరికాలోని జార్జియా స్టేట్‌లోని గ్వినెట్‌ కౌంటీలో భార్యతో గొడవ పడిన ఓ ఎన్నారై విచక్షణ కోల్పోయి ఆమె కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి తప్పించుకున్న ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్కుని తమ ప్రాణాలు రక్షించుకోగలిగారు. భారత మూలాలున్న విజయ్‌ కుమార్ (51), మీము డోగ్రా భార్యాభర్తలు. వీళ్లకు ఓ కొడుకు (12) ఉన్నాడు. ఈ కుటుంబం నివాసముంటోంది అట్లాంటాలో. అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొడుకును తీసుకుని గ్వినెట్‌ కౌంటీలోని బ్రూక్‌ ఐవీ కోర్ట్‌లో ఉన్న భార్య తరఫు బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీయదు.. కాసేపటికి 112 ఎమర్జెన్సీ నెంబర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. విజయ్‌ కొడుకే పోలీసులకు కాల్‌ చేసింది. మరో ఇద్దరు పిల్లలతో కలిసి అల్మారాలో దాక్కున్నాడతను. తన తల్లితో తండ్రికి గొడవ జరిగిందని, అది పెద్దదై తుపాకీతో ఆమెను, ఆమె బంధువులను కాల్చేశాడని ఆ చిన్నారి చెప్పాడు. తమనూ చంపే ప్రయత్నం చేయడంతో అక్కడ దాక్కున్నామని చెప్పాడు. ఆ వెంటనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంటి వెనుక గుండా సమీపంలోని అడవిలోకి పారిపోయిన విజ...