Posts

Showing posts with the label Google Maps new feature with AI technology?

ఏఐ టెక్నాలజీతో గూగుల్ మ్యాప్స్‌ సరికొత్త ఫీచర్‌ ?

Image
గూ గుల్‌ మ్యాప్స్‌లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో కొత్త ప్రదేశాలకు చెందిన అడ్రస్‌లకు సులభంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. మెదటగా ఈ ఏఐ ఫీచర్‌ను అమెరికాలో వినియోగదారులకు మ్యాప్స్‌లో జనరేటివ్ AI ఫీచర్లను అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ వారం ప్రారంభంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్‌ సహాయంతో మ్యాప్స్‌లో కొత్త ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, రివ్యూలు, అక్కడి వెదర్‌కు సంబంధించిన వివరాలను ఏఐ కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా వస్తువుకు సంబంధించిన అంశాన్ని ఎంటర్‌ చేయగానే మీకు దగ్గరల్లో ఆ వస్తువులు ఎక్కడ లభిస్తాయి ? వాటి ఫొటోలు, రేటింగ్‌లు, దగ్గరలోని ఇతర వ్యాపారాలు, స్థలాల గురించిన పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా చూపిస్తుంది. అలాగే మీకు ఇష్టమైన ఆహారం కోసం టైప్‌ చేయగానే ఆ ఫుడ్‌ ఎక్కడ లభిస్తుంది. అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది.? ఆ ఫుడ్‌ గురించిన పూర్తి సమాచారం, రేటింగ్‌ అన్నింటిని ఏఐ టెక్నాలజీ అందిస్తుంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర...