Posts

Showing posts with the label Gen-Z protests again in Nepal

నేపాల్‌లో మళ్లీ జెన్-జెడ్ నిరసనలు - జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Image
నే పాల్‌ యువతలో మళ్లీ ఆగ్రహం చెలరేగింది. బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో పరిస్థితి మరోసారి దిగజారింది. బుధవారం జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తత తర్వాత గురువారం జెన్-జెడ్ యువత మళ్లీ నేపాల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12:45 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆదేశించింది. సీపీఎన్-యూఎంఎల్ పార్టీ అనేది నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్టీ. గురువారం ఉదయం 11 గంటలకు సిమ్రా చౌక్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. జనసమూహం పెరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. తరువాత మరింత అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తతలను దారి తీయడంతో వెంటనే పరిస్థితిని అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు. ఈ సందర్భంగా పలువురు జెన్-జెడ్ యువత మాట్లాడుతూ.. బుధవారం జరిగిన ఘర్షణకు సంబంధించి తాము ఫిర్యాదు చేసిన యుఎంఎల్ కార్మికులందరినీ పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు. బుధవారం నాడు జెన్-జెడ్ యువత, యూఎంఎల్ కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. యూఎంఎల్ పార్టీ యువత మేల్కొలుపు ప్రచారాన్న...