Posts

Showing posts with the label Four Rajya Sabha seats in Andhra Pradesh finalized?

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ బెర్తులు ఖరారు ?

Image
ఆం ధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఎస్ నిరంజన్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ లో ముగియబోతోంది. వీరంతా వైసీపీ సభ్యులే. మరో సభ్యుడు సానా సతీష్ బాబు (టీడీపీ) పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనుంది. దీంతో ఈ నాలుగు సీట్లకూ అభ్యర్ధులు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి నారా లోకేష్ కు సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్ బాబుకు మాత్రం ఈసారి పొడిగింపు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు గతంలో పూర్తి సమయం ఎంపీగా ఛాన్స్ దక్కకపోవడంతో ఈసారి పొడిగింపు ఇస్తారని సమాచారం. మిగిలిన మూడు సీట్లను టీడీపీ, జనసేన, బీజేపీ పంచుకోబోతున్నట్లు సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తెలిపారు. ఇందులో టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, జనసేన కోటాలో లింగమేనని రమేశ్ బాబు, బీజేపీ నుంచి మాజీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. చివరి నిమిషంలో బీజేపీ ఏదైనా ఒత్తిడి చేస్తే తప్ప ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లేనని ప్రవీణ్ పుల్లట ట్వీట్ చేశారు.