Posts

Showing posts with the label Former US President Barack Obama

గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నాయి : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

Image
అ మెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా యూట్యూబర్ బ్రియాన్ టైలర్ కోవెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏలియన్స్ గురించి కీలక విషయాల్ని ఒబామా వెల్లడించారు. ''ఏలియన్స్ ఉన్న మాట వాస్తవమే. అయితే, అవి ఎక్కడున్నాయో కచ్చితంగా తెలియదు. నేను వాటినేమీ చూడలేదు. అలాగే వాటిని అమెరికాకు చెందిన రహస్య ప్రదేశం ఏరియా 51లో ఉంచారనే ప్రచారంలో నిజం లేదు. అక్కడ వాటిని దాచడానికి ఎలాంటి భూగర్భ సౌకర్యం లేదు. ఏదైనా భారీ కుట్ర ఉంటే తప్ప అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా అలాంటి విషయాన్ని దాచలేరు'' అని ఒబామా వ్యాఖ్యానించారు. ఏలియన్స్‌ ఉనికికి, అమెరికాలోని నెవాడలో ఉన్న యూఎస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ అయిన రహస్య ప్రదేశం ఏరియా 51కు సంబంధం ఉందనే ప్రచారంలో నిజం లేదని ఒబామా కొట్టిపారేశారు. అమెరికాలోనే అత్యంత రహస్య ప్రదేశం నెవాడాలో ఉంటుంది. ఇక్కడికి ఏలియన్స్ వస్తుంటాయని, యూఎఫ్‌ఓలు కూడా ఉంటాయని ప్రచారం ఉంది. ఏలియన్స్‌ను ఇక్కడ బంధించి, వాటిపై పరిశోధనలు జరుపుతున్నారని చాలా మంది నమ్ముతుంటారు. 2013 వరకు కూడా ఏరియా 51ను అమెరికా అధికారి...