Posts

Showing posts with the label Former RBI Governor Raghuram Rajan

దేశంలో శ్రామిక శక్తిని కాపాడుకునేందుకు అత్యవసర సంస్కరణలు చేపట్టాలి !

Image
ఏఐ కారణంగా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేథ వల్ల చేతితో చేసే ఏ ఉద్యోగమూ పోదని రఘురాం రాజన్ వెల్లడించారు. అయితే మన దేశంలో విచ్చిన్నమైన విద్యా వ్యవస్ధ ఆ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్దితుల్లో ఉండదని ఆయన హెచ్చరించారు. దేశంలో శ్రామిక శక్తిని కాపాడుకునేందుకు అత్యవసర సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మన దేశం తక్కువ శిక్షణ పొందిన, చాలా సందర్భాలలో పోషకాహార లోపం ఉన్న శ్రామిక శక్తితో ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు పయనిస్తోందని కుశాల్ లోధాతో పాడ్‌కాస్ట్‌లో రాజన్ తెలిపారు. భారత్ తన యువతను పనికి ఎలా సిద్ధం చేస్తుందనే దానిపై జాతీయ స్ధాయిలో పునరాలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం విద్యా డిగ్రీలపై కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలపై స్పష్టమైన దృష్టితో దీన్ని ప్రారంభించాలన్నారు. ప్లంబింగ్, ఎయిర్ క్రాప్ట్ ఇంజిన్ రిపేర్ వంటి పలు ఉద్యోగాలు ఆటోమేషన్ కు నిరోధంగా, పనికి ఉదాహరణగా ఉన్నాయని రఘురామ్ రాజన్ తెలిపారు. కానీ భారతదేశ ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ముఖ్యమైన ఉద్యోగాలకు అర్హత సాధించడానికి ప్రాథమిక నైపుణ్యాలైన గణితం, సైన్స్, కమ్యూనికేషన్ తో సన్నద్ధం చేయడం లేదని ఆయన పేర్...