Posts

Showing posts with the label Former IPS officer's wife loses Rs. 2.58 crore to cyber fraudsters

సైబర్ కేటుగాళ్ల బారినపడి రూ.2.58 కోట్ల మేర నష్టపోయిన మాజీ ఐపీఎస్ భార్య !

Image
హై దరాబాద్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ కేటుగాళ్ల బారిన పడి రూ.2.58 కోట్ల మేర నష్టపోయారు. తాజాగా ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రేడింగ్‌లో చిట్కాల చెబుతామని మొదట వాట్సాప్ మెసేజ్ పంపించారు. తమ చిట్కాలు పాటిస్తే ట్రేడింగ్‌లో 500 శాతం లాభాలు వస్తాయని చెప్పారు. సెబీ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అంటూ కొన్ని నకిలీ కాపీలను కూడా చూపించారు. ఈ విషయాలపై అవగాహన లేకపోవడంతో ఆమె తన భర్త మొబైల్ నెంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితురాలు భారీగా పెట్టుబడులు పెట్టారు. 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్ల మేర బదిలీ చేశారు. ఆ తరువాత పెట్టుబడులను నిలిపివేయడంతో నిందితులు బెదిరింపులకు దిగారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిలిపివేస్తే అప్పటివరకూ పెట్టిన పెట్టుబడి పోతుందని బెదిరించారు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.