Posts

Showing posts with the label Forest personnel have increased patrols in the area to track the tiger's movements

పులి దాడిలో చనిపోయిన రెండు పశువులు : గ్రామస్తులకు అటవీ శాఖ హెచ్చరిక జారీ

Image
తె లంగాణలోని కొమురంభీం జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాన్ని పెంచుతోంది. తాజాగా తిర్యాని మండలంలో రెండు పశువులపై పులి దాడి  చేయడంతో అవి చనిపోయాయి. గోండు గూడ, తోయగూడ గ్రామాలకు చెందిన ఆవుల మీద పులి దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలం పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించారు. పులి సంచారం దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. “గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి. అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దు” అని అటవీ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పులి కదలికలు తెలుసుకోవడానికి అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. ఎవరికైనా పులి జాడ తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.