Posts

Showing posts with the label Five-day work week implementation

ఐదు రోజుల పనిదినాల అమలు : 27న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్తంగా సమ్మె

Image
ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకింగ్ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా యాజమాన్యాలకు అందించాయి. ఈ నిర్ణయంతో దేశంలోని అన్ని బ్యాంకులు జనవరి 24 నుంచి 27వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు మూత పడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులపై కూడా సమ్మె ఎఫెక్ట్ పడనుంది. దీంతో నాలుగు రోజు పాటు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగొచ్చు. బ్యాంక్ సేవలపై ఆధారపడేవారు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున ముందే లావాదేవీలు లేదా ఇతర పనులు నిర్వహించుకోవడం మంచిది. బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేస్తూ ఈ నెల 27న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని బ్యాంక్ ఉద్యోగులు, సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. ఈ యూనియన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోని ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ రోజు బ్యాంకు సేవలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని రోజులు ఉండాలని బ్యాంక్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 2024న దీనికి సంబంధించి...