Posts

Showing posts with the label Financial assistance of Rs. 30.35 lakhs for athlete Jyothi Yarraji

అథ్లెట్ జ్యోతి యర్రాజికి రూ.30.35 లక్షల ఆర్థిక సాయం

Image
వి శాఖపట్నంకు చెందిన అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు రూ.30.35 లక్షల చెక్కును మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో అందజేశారు.జ్యోతి తన కుటుంబ సభ్యులు, 'శాప్' ఛైర్మన్ రవినాయుడుతో కలిసి మంత్రిని కలుసుకున్నారు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన జ్యోతి కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి ప్రతిష్టలను పెంచిన జ్యోతికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆమెను లోకేష్ ప్రోత్సహించారు. ఒక సాధారణ కుటుంబంలో జ్యోతి జన్మించారు. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా, తల్లి హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా పెద్ద స్థాయిలో కాకపోయినా, జ్యోతి తల్లితండ్రుల కష్టంతో ముందుకు సాగింది. చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగి, పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హెర్డిల్స్‌లో శిక్షణ పొందడం ప్రారంభించింది....