Posts

Showing posts with the label Fierce US Attacks on Kharg Island

ఖర్గ్‌ ఐలాండ్‌పై అమెరికా భీకర దాడులు

Image
ఇ రాన్ దేశ చమురుకు కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ పై  అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ తాను ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దాడులు చేసిందని తెలిపారు. ఈ ఐలాండ్లో ఇరాన్ సైనిక కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. పశ్చిమాసియాలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటిని తెలిపారు. ఇక్కడ చమురు మౌలిక సదుపాయలపై మాత్రం దాడులు చేయలేదన్నారు. ఒకవేళ హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలను అడ్డుకుంటే వాళ్ల చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. అమెరికా వద్ద అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయన్నారు. తాము టార్గెట్ చేసే వాటిని ఇరాన్ కు కాపాడుకునే సామర్థ్యం లేదన్నారు. ఆ దేశంలో అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు వాళ్లతో సంబంధాలు ఉన్నవాళ్లు వెంటనే ఆయుధాలు వదిలేయాలన్నారు. ఇరాన్ లో  మిగిలిపోయిన ప్రాంతాలను రక్షించుకోవడం తెలివైన పనని తెలిపారు. అయితే ఖర్గ్ ఐలాండ్ పై  దాడులు జరగడంపై ఇరాన్ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు.