Posts

Showing posts with the label Everyone is praising the girl's bravery

సాహంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడిన బాలిక : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Image
ఇ ద్దరు చిన్నారుల ప్రాణాలను ఓ బాలిక సాహంతో కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఓ బాలిక లిఫ్ట్ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్న పిల్లలను కాపాడింది. సాంకేతిక సమస్యనో మరో కారణమో కానీ.. సడెన్ గా లిఫ్ట్ తలుపులు మూసుకోపోయాయి. తన కాలు అందులో చిక్కుకుపోయింది. అయినా ఆ బాలిక ఏమాత్రం బెదరలేదు. అంతేకాదు.. తోటి పిల్లలను బయటకు తీసుకొచ్చే వరకు ధైర్యాన్ని ప్రదర్శించి పెను ప్రమాదాన్ని తప్పించింది. ఇది గమనించిన పిల్లల తల్లులు వెంటనే అక్కడికి వచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరిచి వారిని రక్షించారు. ఆపద సమయంలో భయపడకుండా బాలిక ప్రదర్శించిన ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. అది 41 సెకన్ల వీడియో. ఎక్స్ లో షేర్ చేశారు. ఓ బాలిక, ఇద్దరు చిన్న పిల్లలు లిఫ్ట్ లో ఉన్నారు. బాలిక ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో సడెన్ గా లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడం ప్రారంభించాయి. ఇద్దరు చిన్న పిల్లలు లోపలే ఉన్నారు. దీంతో బాలిక లిఫ్ట్ డోర్ క్లోజ్ అవకుండా తన కాలుని అడ్డుగా పెట్టింది. ఈ క్రమంలో ఆమె కాలు అందులో చిక్కుకుంది. అయినా బాలిక భయపడకుండా అలానే ఉండిపోయింది...