Posts

Showing posts with the label Ethanol Blending Target Achieved Five Years Early

గడువుకంటే ఐదేళ్ల ముందే సాధించిన ఇథనాల్ బ్లెండింగ్ : ప్రపంచంలో మూడోవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్

Image
ఇ థనాల్ తయారీలో ప్రపంచంలో మూడోవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ణయించిన గడువుకంటే ఐదేళ్ల ముందే సాధించింది. దీంతో క్రూడ్ దిగుమతులపై ఆధారపడటం కొంత తగ్గడంతో పాటు చెరకు, వరి, మొక్కజొన్న వంటి పంటలకు కొత్త మార్కెట్ ఏర్పడింది. 2014 నుంచి ఇథనాల్ వల్ల చక్కెర మిల్లులకు రూ.లక్షా 29వేల కోట్లకు పైగా ఆదాయం, రైతులకు రూ.లక్షా 60వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ E20 తర్వాత అసలు సవాలు మొదలైంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్దంలో దాదాపు 3 రెట్లు పెరిగింది. సుమారు 680 కోట్ల లీటర్ల నుంచి దాదాపు 2వేల కోట్ల లీటర్లకు చేరుకుంది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే ఇదే సమయంలో కంపెనీలకు కొత్త సమస్యలు మెుదలయ్యాయి. భారీగా సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ.. కొన్ని ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. తగిన డిమాండ్ లేకపోవడంతో పెంచుకున్నఉత్పత్తి సామర్థ్యం ఖాళీగా ఉంచుకుంటున్నాయి ఇథనాల్ తయారీ కంపెనీలు. ఇక ముందుకు E25, ఆ తర్వాత E85 వైపు వెళ్లేందు...