మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య : చెన్నైలో అత్యవసర ల్యాడింగ్ : 186 మంది ప్రయాణికులు సురక్షితం
మ లేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే చెన్నై విమానాశ్రయాన్ని సంప్రదించి అనుమతి లభించగానే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 186 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి చెన్నైకి బయల్దేరిన ఎంహెచ్156 గాల్లో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండో ఇంజిన్‌లో సమస్య ఏర్పడడంతో పైలట్లు వెంటనే చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారు. సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాంతో, చెన్నై విమానాశ్రయ అధికారులు హుటాహుటిన ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్, ఫైరింజన్లు, సీఐఎస్‌ఎఫ్ బృందాలను పిలిపించి సురక్షితంగా ల్యాండ్ చేయించారు.