వెనిజులా ప్రజలకు ఫిబ్రవరి 3 వరకు ఉచిత బ్రాడ్‌బాండ్ సేవలు : ఎలన్‌మస్క్ ఎక్స్‌లో పోస్ట్
వె నిజులా ప్రజలకు తమ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. అమెరికా దాడులతో వెనిజులా ప్రజలు, మొబైల్ నెట్‌వర్క్, విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అక్కడి ప్రజలకు ఎలన్‌మస్క్ మద్దతుగా నిలువడం విశేషం. ఫిబ్రవరి 3 వరకు వెనిజులా ప్రజలు ఉచిత బ్రాడ్‌బాండ్ సేవలను పొందవచ్చని ఎలన్‌మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట స్టార్‌లింక్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవడానికి అవకాశం దక్కింది.