ట్రంప్ బెదిరింపు సుంకాలపై ఈయూ దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ !
ట్రంప్ బెదిరింపు సుంకాలపై ఈయూ దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో యురోపియన్ యూనియన్ దేశాల అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లాన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశారు. ట్రంప్ ప్రతిపాదిత సుంకాలు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈయూ- యూఎస్ సంబంధాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఇందులో వారు హెచ్చరించారు. పరస్పర సహకారం తప్పనిసరిగా మారిన పరిస్థితుల్లో ఈ ధోరణి ఇరువైపులా నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, వాణిజ్య అడ్డంకులకు ఊతమిస్తాయని చెప్పారు.'యూరప్ ఐక్యంగా, సమన్వయంతో మరియు దాని సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటుంది' అంటూ ఈయూ చీఫ్ లు ట్వీట్ చేశారు. మిత్రదేశాలతో కలిసి డెన్మార్క్ ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలను కూడా వారు సమర్థించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను పెంచడమే ఈ విన్యాసం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. డెన్మార్క్‌కు పూర్తి మద్ద...