Posts

Showing posts with the label హోండా SP125 స్పోర్ట్ ఎడిషన్ విడుదల

హోండా SP125 స్పోర్ట్ ఎడిషన్ విడుదల !

Image
హోండా SP125 టూవీలర్‌ను ఈ సంవత్సరం బీఎస్-6 స్టాండర్ట్స్-2 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో '2023 హోండా SP125' పేరుతో లాంచ్ చేయగా, మార్కెట్లోకి ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా హోండా SP125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. హోండా SPR125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాత తరం మోడళ్లలో వినియోగించిన అదే 123.94cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10.72bhp పవర్‌ను, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను తాజా BS-VI OBD-2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో వెహికల్ అందుబాటులో ఉంటుంది. బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో ప్రధాన ఆకర్షణ. గేర్ పొజిషన్ ఇండికేటర్, మైలేజ్ ఇన్ఫర్మేషన్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది. కొత్త SP125 స్పెషల్ ఎడిషన్ 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ (3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ, 7 సంవత్సరాల ఆప్షన్‌)తో అందుబాటులో ఉంటుంది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త SP125 స...