ఫోన్లలోకి స్పైవేర్ !
రా కెట్ దాడుల నుంచి ప్రజలు తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ వినియోగించే ఓ యాప్‌పై హ్యాకర్లు కన్నేసినట్లు అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. రాకెట్ దాడుల నుంచి తప్పించుకొనేందుకు 'రెడ్ అలర్ట్' పేరిట ఒక ఓపెన్ సోర్స్ యాప్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరిగిపోవడంతో ఈ యాప్‌నకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు హ్యాకర్లు ఈ యాప్ తప్పుడు వెర్షన్‌ను సృష్టించి అందుబాటులోకి తెచ్చారు. ఇది పనితీరులో సాధారణ రెడ్‌అలర్ట్ వలే ఉంటుంది. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం స్పైవేర్ పనిచేస్తుందని అమెరికాకు చెందిన టెక్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ నివేదికలో హెచ్చరించింది. ఈ తప్పుడు యాప్ వినియోగదారుల డేటాను సేకరిస్తున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా కాల్స్ లాగ్, ఎస్‌ఎంఎస్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, దీంతోపాటు ఆ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన యాప్స్ వివరాలు తస్కరిస్తున్నట్లు క్లౌడ్‌ఫ్లేర్ వెల్లడించింది. ఈ యాప్‌ను ఇజ్రాయెల్ ప్రజలు ఇన్‌స్టాల్ చేసేందుకు ఓ తప్పుడు వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశారు. ఈ సైట్ అక్టోబర్ 12వ తేదీ నుంచి పనిచేస్తోంది. ఇందులో ఆండ్రాయ...