Posts

Showing posts with the label స్మార్ట్​ఫోన్‌ను వాడేవారిలో 'స్మార్ట్​ఫోన్​ పింకీ' ?

స్మార్ట్​ఫోన్‌ను వాడేవారిలో 'స్మార్ట్​ఫోన్​ పింకీ' ?

Image
స్మా ర్ట్ ఫోన్ యూజర్లు చాలామందికి 'స్మార్ట్​ఫోన్​ పింకీ' అనే ప్రాబ్లమ్ వస్తోంది. ప్రత్యేకించి ఐఫోన్ వాడే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని యాపిల్ కంపెనీ ఖండిస్తోంది. అదంతా దుష్ప్రచారం అని స్పష్టం చేస్తోంది. పింకీ ఫింగర్ అంటే చిటికెన వేలు. స్మార్ట్ ఫోన్ వాడకంతో మన చిటికెన వేలు నిర్మాణ స్వరూపం దెబ్బతింటోంది. దాని షేప్ మారిపోతోంది. ఈ సమస్యనే 'స్మార్ట్​ఫోన్​ పింకీ' అని పిలుస్తున్నారు. స్మార్ట్ ఫోన్​కి సపోర్ట్​గా చిటికెన వేలు అడ్డుపెట్టి ఎక్కువకాలం వినియోగించినప్పుడు వేలు వంగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. ఫోన్​ను ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉంచడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఫోన్ బరువు వేలుపై ఒత్తిడి కలిగించి శాశ్వతంగా వంగిపోయేలా చేస్తుంది. ఫోన్​ సంబంధిత వైద్య పరిస్థితులపై వైద్య నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎక్కువ టైం ఫోన్​లలో టెక్స్ట్​ చేయడం, ఫోన్​ని ఎక్కువ సేపు పట్టుకుని ఉపయోగించక పోవడమే మంచిదని సూచిస్తున్నారు. టెక్స్ట్ చేయడం కోసం ఎక్కువ సమయం మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచి ఉంచే వ్యక్తులలో తలెత్...