Posts

Showing posts with the label సెట్-టాప్ బాక్స్ లేకుండా ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్స్

సెట్-టాప్ బాక్స్ లేకుండా ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్స్ !

Image
ఇ-వ్యర్థాల నియంత్రణ, క్వాలిటీ, వినియోగదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మూడు ఎలక్ట్రానిక్ డివైజ్‌ల కోసం కొత్తగా నాణ్యాత ప్రమాణాలను నోటిఫై చేసింది. ఈ జాబితాలో డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జర్, వీడియో సర్వైలెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి.  బిల్ట్- ఇన్ శాటిలైట్ ట్యూనర్స్‌తో కూడిన డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ IS 18112:2022 స్పెసిఫికేషన్‌ను మొదటగా నోటిఫై చేసింది. ఈ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం తయారయ్యే టీవీలకు LNBతో డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచితంగా ప్రసారమయ్యే టీవీ, రేడియో ఛానెల్‌లను పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పే, ఫ్రీ ఛానెల్‌లను చూడాలంటే సెట్-టాప్ బాక్స్‌ తప్పనిసరి. ఇక, దూరదర్శన్ ప్రసారం చేసే ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ (నాన్- ఎన్‌క్రిప్టెడ్) చూడాలంటే కూడా వీక్షకుడు తప్పనిసరిగా సెట్ టాప్ బాక్స్‌ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను తొలగించే ప్రక్రియలో ఉంది. దూరదర్శన్ ...