Posts

Showing posts with the label సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం

సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం

Image
అ మెరికా లోని డల్లాస్ వేదికగా గురువారం సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆల్‌రౌండ్ షోతో విజయఢంకా మోగించింది. మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌ను పసికూన అమెరికా మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. యూఎస్ఏ బౌలర్లలో కెంజిగె (3/30), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాన్క్ పటేల్‌ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆరోన్‌ జోన్స్‌ (36 నాటౌట్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆంద్రీస్‌ గౌస్‌ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూప్ తలో వికెట్ తీశారు. ఛేదనలో అమెరికా 13 ఓవర్లకు 104/1తో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ బౌలర్లు పుంజుకుని మ్యాచ్‌ను హోరాహోరీగా మార్చారు. క్రమంగా వికెట్లు తీస్తూ అమెరికాపై ఒత్తిడి తెచ్చారు. షాహిన్ అఫ్రిది 18 ఓవర్‌లో 7 ...