Posts

Showing posts with the label శుభమాన్ గిల్

శుభమాన్ గిల్, మోహిత్ శర్మల కి సీఐడీ సమన్లు !

Image
భా రత క్రికెటర్లు శుభమాన్ గిల్, మోహిత్ శర్మల కి గుజరాత్ సీఐడి క్రైంబ్రాంచి పోలీసులు సమన్లు పంపనున్నారు. రూ.450 కోట్ల కుంభకోణానికి సంబంధించి అతడిని విచారించేందుకు సమన్లు పంపనున్నట్లు తెలిపారు. అతనితోపాటు రాహుల్ తెవాటియా, ఆర్ సాయి సుదర్శన్ లకు కూడా సమన్లు పంపనున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కు గత సీజన్లో ప్రాతినిథ్యం వహించారు. తాజాగా గుజరాత్ లో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోంజి స్కామ్ తరహాలో ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో క్రికెటర్లను పోలీసులను ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీనితో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయాలను గుజరాత్ కు చెందిన అహ్మదాబాద్ మిర్రర్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. అయితే దీనిపై సదరు క్రికెటర్ల నుంచి ఎలాంటి స్టేట్మెంట్లు ప్రస్తుతానికి బయటకు రాలేదు. ఇక కుంభకోణానికి ప్రధాన సూత్రధారి భూపేంద్ర సింగ్ జాలాను అరెస్టు చేసి, పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. జాలా అనేక అనధికార ఖాతాలను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీలను రిషిక్ మెహత...