డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్ !
ఉ త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిల్ ఆఫీసర్ (సీఓ)గా పనిచేసే శంకర్ కనౌజియా మహిళా కానిస్టేబుల్‌తో ఓ హోటల్ గదిలో పట్టుడిన కారణంగా కానిస్టేబుల్ ర్యాంక్‌కి తగ్గించారు. గతంలో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిల్ ఆఫీసర్(సీఓ)గా పనిచేసిన శంకర్ కనౌజియా ప్రస్తుతం గోరఖ్‌పూర్‌లోని 6వ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ బెటాలియన్‌కు కేటాయించబడ్డారు. జూలై 2021లో లీవ్ తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కారణాలు పేర్కొంటూ కన్నౌజియా ఉన్నతాధికారుల అనుమతితో లీవ్ లీసుకున్నాడు. అయితే, ఆ సమయంలో ప్రైవేట్, అధికారిక మొబైల్ నెంబర్లను స్విచ్ ఆఫ్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. తన భర్త కనిపించడం లేదని కన్నౌజియా భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అతని మొబైల్ చివరిసారిగా కాన్పూర్‌లోని ఒక హోటల్ వద్ద చివరిసారిగా ఆగిపోయిందని తెలిసింది. దీంతో పోలీసులు హోటల్‌కి వెళ్లి చూడగా, కన్నౌజియా, మహిళా కానిస్టేబుల్‌తో పట్టుబడ్డాడు. సీసీటీవీ కెమెరాలు, వారి ఎంట్రీకి సంబంధించినప అన్ని కీలక సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో కన్నౌజియ...