ఇస్రో చేపట్టిన పారాచ్యూట్ టెస్ట్ విజయవంతం !
ఇస్రో ముందుగా తలపెట్టినట్టుగా జరిగి ఉంటే 2022 లోనే గగన్ యాన్ ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఇస్రో క్యాలెండర్ పూర్తిగా అస్తవ్యస్తం అయింది. ఈ క్రమంలో రెండేళ్ల ఆలస్యంగా 2024 లో ప్రయోగం జరగనుంది. ఇందు కోసం ఇస్రో ముందస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రయోగం కోసం ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు.. నిర్దేశిత కక్ష్యలో మూడు రోజుల పాటు ప్రయోగం అనంతరం తిరిగి భూమి మీదకు వస్తారు. అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ ముగ్గురు వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కూడా పూర్తి కావొచ్చింది.. సాధారణంగా ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రక్రియతో పోల్చితే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. వ్యోమనౌకను భూమిపై నుంచి కక్ష్యలోకి పంపడం కోసం భారీ బరువును మోసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఇస్రోకి నమ్మకమైన LVM-3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. మూడు రోజుల ప్రయోగం తర్వాత తిరిగి వ్యోమగాములు భూమికి తిరిగి తీసుకు రావడం అసలైన సవాల్. ఇందుకోసం వాడే టెక్నాలజీ ఇస్రో సొంతంగా రూపొందిస్తోంది. తిరిగి వచ్చే సమయంలో క్యాప్సూల్ మాడ్యూల్ ద్వారా భూమికి తిరిగి వస్తారు. అంతరిక్షం నుంచి భూకక్ష్యలోకి వచ్చేప్...