'జియో ట్యాగ్' !
యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ లాగా రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. 'జియో ట్యాగ్' పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి మరిచిపోయే అలవాటున్న వారికి ఈ ట్యాగ్ బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ జియోట్యాగ్ ను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్యాగ్ అసలు ధర రూ. 2,199 గా జియో పేర్కొంది. అయితే, ప్రస్తుతం వెల్‌కం ఆఫర్ కింద రూ. 749లకే అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో, రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉంది. వైట్ కలర్ లో వచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్ బరువు 9.5 గ్రాములు. ఎక్కువగా మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు ఈ ట్యాగ్ ను తగిలించాలి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన జియోథింగ్స్ యాప్ కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ జియోట్యాగ్ తగిలించిన వస్తువును వదిలి ఎక్కువ దూరం వెళ్లిపోతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇండోర్‌లో 20 మీటర్లు, అవుట్ డోర్‌లో 50 మీటర్ల వరకు ఈ జియోట్యాగ్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ట్యాగ్ లో మార్చుకునేందుకు...