Posts

Showing posts with the label విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు !

Image
దే శీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ను మెప్పించకపోవడం మరో కారణం. దీంతో సూచీలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. నేడు వెలువడనున్న విప్రో, ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించనునున్నారు. బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా బజాజ్‌ ఆటో షేర్లు ఇవాళ 13 శాతం మేర కుంగాయి. సెన్సెక్స్ ఉదయం 81,758.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,501.36) లాభాల్లో ప్రారంభబైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 80,905.64 కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 221.45 పాయింట్ల నష్టంతో 24,749.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది. సెన్సెక్స్‌లో నెస్లే ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, ...