Posts

Showing posts with the label వాణిజ్య రహస్యాలను తెలుసుకొని

'థ్రెడ్స్' పై దావా వేస్తాం !

Image
ట్వి ట్టర్ మాజీ ఉద్యోగులను మెటా చేర్చుకొని, వాణిజ్య రహస్యాలను తెలుసుకొని, ట్విట్టర్‌కు కాపీక్యాట్ అప్లికేషన్‌ను రూపొందించిందని ఆరోపిస్తూ ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో దావా వేయడానికి సిద్ధమయ్యారని సెమాఫోర్ రిపోర్ట్ వెల్లడించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జులై 6న పంపిన లేఖలో ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో దావా వేస్తామని బెదిరించారు. ఆ లేఖలో "ట్విట్టర్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేయడంలో మెటా నిమగ్నమైందని" ఆరోపించారు. ట్విట్టర్ రహస్య సమాచారం వాడకాన్ని తక్షణమే ఆపివేయాలని, దాని వల్ల కలిగే హానిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని మెటాను స్పిరో డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ ఉల్లంఘనను కంపెనీ అసలు సహించబోదని లేఖలో స్పష్టం చేశారు. ట్విట్టర్ వ్యాపార రహస్యాలను యాక్సెస్ చేసిన మాజీ ట్విట్టర్ ఉద్యోగులను మెటా నియమించుకున్నట్లు ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ బెదిరించడాన్ని బట్టి చూస్తుంటే మెటా ఛాలెంజ్‌ను మస్క్ తేలికగా తీసుకోవడం లేదని అర్థమవుతోంది. ఒకవేళ రెండు కంపెనీలు కోర...