Posts

Showing posts with the label వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో వెల్లడి

ఫోటోను బ్లర్ చేసుకునేలా కొత్త ఫీచర్ !

Image
డెస్క్ టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఇమేజ్ బ్లర్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉంది. ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో వెల్లడించింది. కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఈ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని రిపోర్ట్ ద్వారా తెలిపింది. మరింత సెక్యూర్ గా ఫోటోలు షేర్ చేసుకునేందుకు ఈ బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫోటోలు పంపించే ముందు ఆ ఫోటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సహాయంతో బ్లర్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్కు ఏదైనా భాగం ఫోటోలు కనిపించకూడదు అనుకుంటే దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ వలన కలగనుంది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్లు మొబైల్ బీటా వెర్షన్ కు కూడా తెచ్చే అవకాశం ఉంది. యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అలాగే గ్రూపుల నుంచి సైలెంట్ గా ఎగ్జిట్ అవ్వడం, ఆన్లైన్ యాక్టివ్ స్టేటస్ ను హైడ్ చేసుకోవడం, వ్యూ వన్స్ మెసేజ్ లకు స్క్రీన్ షాట్స్ ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతుంది. ఈ ఫ...