'దేవర' సినిమా ప్రత్యేక షోలకు, టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి !
ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం 'దేవర' సినిమా ప్రత్యేక షోలకు అనుమతి ప్రకటించింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. తొలిరోజు అర్దరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. టికెట్ ధరలను పెంచుకునే వెసులు బాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ జీఎస్టీతో కలిపి అప్పర్ క్లాస్ 110 రూపాయలు, లోవర్ క్లాస్ 60 రూపాయలు, మల్టిప్లెక్స్ 135 రూపాయల వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, నిర్మాతల్లో ఒకరైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.